Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Jathiyah — Ayah 17

وَءَاتَيۡنَٰهُم بَيِّنَٰتٖ مِّنَ ٱلۡأَمۡرِۖ فَمَا ٱخۡتَلَفُوٓاْ إِلَّا مِنۢ بَعۡدِ مَا جَآءَهُمُ ٱلۡعِلۡمُ بَغۡيَۢا بَيۡنَهُمۡۚ إِنَّ رَبَّكَ يَقۡضِي بَيۡنَهُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ فِيمَا كَانُواْ فِيهِ يَخۡتَلِفُونَ ١٧
మరియు మేము వారికి అసత్యము నుండి సత్యమును స్పష్టపరిచే సూచనలను ప్రసాదించాము. వారు మాత్రం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యము గురించి వారి ముందు వాదనలు నెలకొన్న తరువాత విభేదించుకున్నారు. మరియు వారికి ఈ విభేదాలకు దారి తీసింది మాత్రం వారిలో కొందరు కొందరిపై నాయకత్వము,ప్రతిష్ట పట్ల ఉన్న అత్యాస వలన ఆధిక్యతను ప్రదర్శించటం. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ప్రళయదినమున వారి మధ్య వారు ఇహలోకంలో విభేదించుకున్న వాటి విషయంలో తీర్పునిస్తాడు. అప్పుడు ఎవరు సత్యవంతుడో,ఎవరు అసత్యవంతుడో తేటతెల్లమవుతుంది.