Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Jathiyah — Ayah 18

ثُمَّ جَعَلۡنَٰكَ عَلَىٰ شَرِيعَةٖ مِّنَ ٱلۡأَمۡرِ فَٱتَّبِعۡهَا وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَ ٱلَّذِينَ لَا يَعۡلَمُونَ ١٨
ఆ తరువాత మేము మీ కన్న మునుపు ప్రవక్తలకు ఆదేశించిన మా ఆదేశము నుండి మేము మిమ్మల్ని విశ్వాసము వైపునకు మరియు సత్కర్మ వైపునకు పిలిచే ఒక మార్గము,సంప్రదాయము,పధ్ధతిపై నియమించాము. కావున మీరు ఈ ధర్మమును అనుసరించండి. మరియు మీరు సత్యమును గురించి తెలియని వారి మనోవాంఛలను అనుసరించకండి. వారి మనోవాంఛలు సత్యము నుండి తప్పించివేస్తాయి.