Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Jathiyah — Ayah 25

وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ مَّا كَانَ حُجَّتَهُمۡ إِلَّآ أَن قَالُواْ ٱئۡتُواْ بِـَٔابَآئِنَآ إِن كُنتُمۡ صَٰدِقِينَ ٢٥
మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులపై స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు వారు వాదించటానికి ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లంతో,ఆయన సహచరులతో వారి ఈ మాటలు తప్ప వారి కొరకు ఎటువంటి వాదన ఉండేది కాదు : "మేము మా మరణం తరువాత లేపబడుతామని వాదనలో మీరు సత్యవంతులేనైతే మరణించిన మా తాతముత్తాతలను మీరు మా కొరకు జీవింపజేయండి".