Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Jathiyah — Ayah 26

قُلِ ٱللَّهُ يُحۡيِيكُمۡ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يَجۡمَعُكُمۡ إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ لَا رَيۡبَ فِيهِ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ٢٦
ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ మిమ్మల్ని సృష్టించి మిమ్మల్ని జీవింపజేస్తాడు ఆ తరువాత ఆయన మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మీ మరణం తరువాత లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ప్రళయదినం నాడు మిమ్మల్ని ఆయన సమీకరిస్తాడు. ఆ దినము రావటం విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాని చాలా మందికి తెలియదు. అందుకనే వారు దాని కొరకు సత్కర్మల ద్వారా సిద్ధం కావటం లేదు.