Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 11

وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلَّذِينَ ءَامَنُواْ لَوۡ كَانَ خَيۡرٗا مَّا سَبَقُونَآ إِلَيۡهِۚ وَإِذۡ لَمۡ يَهۡتَدُواْ بِهِۦ فَسَيَقُولُونَ هَٰذَآ إِفۡكٞ قَدِيمٞ ١١
మరియు ఖుర్ఆన్ ని,తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అవిశ్వసించిన వారు విశ్వాసపరులతో ఇలా పలుకుతారు : ఒక వేళ ముహమ్మద్ తీసుకుని వచ్చినది మంచి వైపునకు మార్గదర్శకం చేసే సత్యమే అయితే ఈ నిరుపేదలు,బానిసలు,బలహీనులు మా కన్న ముందు దానివైపునకు సాగరు. మరియు ఎందుకంటే వారు తమ వద్దకు తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన దానితో మార్గదర్శకం పొందలేదు. తొందరలోనే వారు ఇలా అంటారు : అతడు మా వద్దకు తీసుకుని వచ్చినది ఇది ప్రాచీన అబద్దము. మరియు మేము అబద్దమును అనుసరించము.