Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 12

وَمِن قَبۡلِهِۦ كِتَٰبُ مُوسَىٰٓ إِمَامٗا وَرَحۡمَةٗۚ وَهَٰذَا كِتَٰبٞ مُّصَدِّقٞ لِّسَانًا عَرَبِيّٗا لِّيُنذِرَ ٱلَّذِينَ ظَلَمُواْ وَبُشۡرَىٰ لِلۡمُحۡسِنِينَ ١٢
ఈ ఖుర్ఆన్ కన్న మునుపు అల్లాహ్ మూసా అలైహిస్సలాంపై అవతరింపజేసిన గ్రంధం తౌరాత్ మార్గదర్శకంగా సత్యం విషయంలో అనుసరించటానికి మరియు బనీ ఇస్రాయీల్లోంచి దానిపై విశ్వాసమును కనబరచి దాన్ని అనుసరించిన వారి కొరకు కారుణ్యంగా ఉన్నది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ అరబీ భాషలో దాని కన్న మునుపటి గ్రంధములను దృవీకరించే గ్రంధము. అల్లాహ్ కి సాటి కల్పించటం ద్వారా,పాపకార్యములకు పాల్పడటం ద్వారా తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడిన వారికి దాని ద్వారా హెచ్చరించటానికి. మరియు ఇది తమ సంబంధమును తమ సృష్టికర్తతో మరియు తమ సంబంధమును ఆయన సృష్టితో మెరుగుపరచిన సజ్జనులకు ఒక శుభవార్త.