Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 34

وَيَوۡمَ يُعۡرَضُ ٱلَّذِينَ كَفَرُواْ عَلَى ٱلنَّارِ أَلَيۡسَ هَٰذَا بِٱلۡحَقِّۖ قَالُواْ بَلَىٰ وَرَبِّنَاۚ قَالَ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ ٣٤
మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించిన వారిని నరకాగ్ని వద్దకు అందులో వారిని శక్షించటానికి తిసుకుని రాబడే దినమున వారితో మందలిస్తూ ఇలా పలకబడుతుంది : ఏమీ మీరు చూస్తున్నటువంటి ఈ శిక్ష వాస్తవం కాదా ?! లేదా మీరు ఇహలోకంలో మీరు పలికిన విధంగా అబద్దమా ?! వారు, మా ప్రభువు సాక్షిగా నిశ్ఛయంగా అది సత్యము అని పలుకుతారు. అప్పుడు వారితో ఇలా పలకబడుతుంది : అల్లాహ్ పై మీ అవిశ్వాసం కారణంగా మీరు శిక్షను చవిచూడండి.