Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Ahqaf — Ayah 35

فَٱصۡبِرۡ كَمَا صَبَرَ أُوْلُواْ ٱلۡعَزۡمِ مِنَ ٱلرُّسُلِ وَلَا تَسۡتَعۡجِل لَّهُمۡۚ كَأَنَّهُمۡ يَوۡمَ يَرَوۡنَ مَا يُوعَدُونَ لَمۡ يَلۡبَثُوٓاْ إِلَّا سَاعَةٗ مِّن نَّهَارِۭۚ بَلَٰغٞۚ فَهَلۡ يُهۡلَكُ إِلَّا ٱلۡقَوۡمُ ٱلۡفَٰسِقُونَ ٣٥
ఓ ప్రవక్తా మీరు నూహ్,ఇబ్రాహీమ్,మూసా,ఈసా అలైహిముస్సలాంటి దృఢ సంకల్పం కల ప్రవక్తలు సహహనం పాటించినట్లుగా మీ జాతి వారు మిమ్మల్ని తిరస్కరించటంపై సహనం చూపండి. వారి కొరకు శిక్ష గురించి తొందర చేయకండి. మీ జాతి వారిలో నుండి తిరస్కారులు పరలోకంలో వారికి వాగ్దానం చేయబడిన శిక్షను చూసిన రోజు వారి శిక్ష పొడిగింపు వలన వారు ఇహలోకంలో దినపు ఒక ఘడియను మాత్రమే గడిపారనుకుంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ఒక సందేశము మరియు మానవులకు,జిన్నులకు చాలును. నిశ్చయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లాహ్ విధేయత నుండి తొలగిపోయిన జాతి వారు మాత్రమే శిక్ష ద్వారా నాశనం చేయబడుతారు.