Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Muhammad — Ayah 19

فَٱعۡلَمۡ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ وَٱسۡتَغۡفِرۡ لِذَنۢبِكَ وَلِلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِۗ وَٱللَّهُ يَعۡلَمُ مُتَقَلَّبَكُمۡ وَمَثۡوَىٰكُمۡ ١٩
కావున ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడని నమ్మకమును కలిగి ఉండండి. మరియు మీరు మీ పాపముల మన్నింపును అల్లాహ్ తో వేడుకోండి. మరియు మీరు విశ్వాసపరులైన మగవారి పాపముల కొరకు, విశ్వాసపరులైన స్త్రీల పాపముల కొరకు ఆయనతో మన్నింపును వేడుకోండి. మరియు మీ పగటిలో మీ కార్యకలాపాల గురించి మరియు మీ రాత్రిలో మీ నివాసము గురించి అల్లాహ్ కు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.