Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Muhammad — Ayah 20

وَيَقُولُ ٱلَّذِينَ ءَامَنُواْ لَوۡلَا نُزِّلَتۡ سُورَةٞۖ فَإِذَآ أُنزِلَتۡ سُورَةٞ مُّحۡكَمَةٞ وَذُكِرَ فِيهَا ٱلۡقِتَالُ رَأَيۡتَ ٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ يَنظُرُونَ إِلَيۡكَ نَظَرَ ٱلۡمَغۡشِيِّ عَلَيۡهِ مِنَ ٱلۡمَوۡتِۖ فَأَوۡلَىٰ لَهُمۡ ٢٠
మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారు అల్లాహ్ తన ప్రవక్తపై యుద్ధ ఆదేశమును కలిగిన ఏదైన సూరాను అవతరింపజేయాలని ఆశిస్తూ ఇలా పలికారు : ఎందుకని అల్లాహ్ యుద్ద ప్రస్తావనను కలిగిన ఏదైన సూరాను అవతరింపజేయలేదు ?. ఎప్పుడైతే అల్లాహ్ ఏదైన స్పష్టమైన సూరా అందులో యుద్ధ ఆదేశముల ప్రస్తావన కలిగినది అవతరింపజేసినప్పుడు ఓ ప్రవక్తా హృదయముల్లో రోగము కలిగిన కపటులు మీ వైపునకు తనపై భయము,ఆందోళన కమ్ముకున్న వాడిలా చూస్తారు. వారు యుద్ధం నుండి మరలిపోవటం వలన మరియు దాని నుండి భయపడటం వలన వారి శిక్ష వారికి ఆసన్నమైనదని మరియు వారికి దగ్గరైనదని అల్లాహ్ వారికి వాగ్దానం చేశాడు.