Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 10

إِنَّ ٱلَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ ٱللَّهَ يَدُ ٱللَّهِ فَوۡقَ أَيۡدِيهِمۡۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفۡسِهِۦۖ وَمَنۡ أَوۡفَىٰ بِمَا عَٰهَدَ عَلَيۡهُ ٱللَّهَ فَسَيُؤۡتِيهِ أَجۡرًا عَظِيمٗا ١٠
ఓ ప్రవక్తా నిశ్చయంగా ముష్రికులైన మక్కా వాసులతో యుద్దం చేయటం విషయంలో మీతో బైఅతె రిజ్వాన్ శపథం చేసినవారు అల్లాహ్ తో శపథం చేసినవారు. ఎందుకంటే ఆయనే ముష్రికులతో యుద్దం చేయమని వారిని ఆదేశించాడు. మరియు ఆయనే వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. శపథం సమయంలో అల్లాహ్ చేయి వారి చేతులపై ఉన్నది. మరియు ఆయన వారి గురించి తెలుసుకునేవాడు ఆయనపై వారి నుండి ఏదీ గోప్యంగా ఉండదు. అయితే ఎవరైతే తన శపథమును భంగపరచి అల్లాహ్ తో ఆయన ధర్మమునకు సహాయము చేస్తానని చేసిన వాగ్దానమును పూర్తి చేయలేదో నిశ్చయంగా అతని శపథమును అతను భంగపరచిన దాని నష్టము మరియు తన ప్రమాణమును భంగపరచిన దాని నష్టము అతనిపైనే మరలుతుంది. అది అల్లాహ్ కు నష్టం కలిగించదు. మరియు ఎవరైతే అల్లాహ్ తో ఆయన ధర్మమునకు సహాయం చేస్తానని చేసిన వాగ్దానమును పూర్తి చేస్తాడో అతనికి ఆయన తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అది స్వర్గము.