Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 11

سَيَقُولُ لَكَ ٱلۡمُخَلَّفُونَ مِنَ ٱلۡأَعۡرَابِ شَغَلَتۡنَآ أَمۡوَٰلُنَا وَأَهۡلُونَا فَٱسۡتَغۡفِرۡ لَنَاۚ يَقُولُونَ بِأَلۡسِنَتِهِم مَّا لَيۡسَ فِي قُلُوبِهِمۡۚ قُلۡ فَمَن يَمۡلِكُ لَكُم مِّنَ ٱللَّهِ شَيۡـًٔا إِنۡ أَرَادَ بِكُمۡ ضَرًّا أَوۡ أَرَادَ بِكُمۡ نَفۡعَۢاۚ بَلۡ كَانَ ٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرَۢا ١١
ఓ ప్రవక్తా మక్క వైపు మీ ప్రయాణములో మీతో తోడుగా ఉండటం నుండి అల్లాహ్ వెనుక ఉండేటట్లు చేసిన పల్లె వాసులను మీరు మందలించినప్పుడు వారు మీతో ఇలా పలుకుతారు : మా సంపదల బాధ్యత మరియు మా సంతానము బాధ్యత మీతో పాటు ప్రయాణం చేయటం నుండి మమ్మల్ని తీరిక లేకుండా చేశాయి. కావును మీరు అల్లాహ్ తో మా పాపముల మన్నింపును వేడుకోండి. వారు తమ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో మన్నింపును వేడుకోవటమును కోరటం తమ మనసులలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. ఎందుకంటే వారు తమ పాపముల నుండి పశ్చాత్తాప్పడలేదు. మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ అల్లాహ్ మీకు మేలు చేయదలచితే లేదా కీడు చేయదలచితే మీ కొరకు అల్లాహ్ నుండి ఎవరికీ ఏ అధికారముండదు. అంతేకాదు మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. మీ కర్మల్లోంచి ఒక వేళ మీరు వాటిని దాచినా ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.