Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 12

بَلۡ ظَنَنتُمۡ أَن لَّن يَنقَلِبَ ٱلرَّسُولُ وَٱلۡمُؤۡمِنُونَ إِلَىٰٓ أَهۡلِيهِمۡ أَبَدٗا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمۡ وَظَنَنتُمۡ ظَنَّ ٱلسَّوۡءِ وَكُنتُمۡ قَوۡمَۢا بُورٗا ١٢
ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళటం నుండి మీరు వెనుక ఉండిపోవటానికి సంపదల,సంతానముల బాధ్యత తీరికలేకండా చేయటం అని మీరు వంకపెట్టినది కారణం కాదు. కాని ప్రవక్త మరియు ఆయన సహచరులు వినాశనమునకు గురి అవుతారని మరియు వారు మదీనాలోని తమ ఇంటి వారి వైపునకు మరలిరారని మీరు భావించారు. దాన్ని షైతాను మీ హృదయములలో మంచిగా చేసి చూపించాడు. మరియు మీరు మీ ప్రభువు గురించి ఆయన తన ప్రవక్తకు సహాయం చేయడని తప్పుగా భావించారు. మరియు మీరు ఏదైతే అల్లాహ్ పట్ల చెడు ఆలోచనను కలిగి ముందడుగు వేయటం వలన మరియు ఆయన ప్రవక్త నుండి వెనుక ఉండిపోవటం వలన వినాశనమునకు గురి అయ్యే జనులైపోయారు.