Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 15

سَيَقُولُ ٱلۡمُخَلَّفُونَ إِذَا ٱنطَلَقۡتُمۡ إِلَىٰ مَغَانِمَ لِتَأۡخُذُوهَا ذَرُونَا نَتَّبِعۡكُمۡۖ يُرِيدُونَ أَن يُبَدِّلُواْ كَلَٰمَ ٱللَّهِۚ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمۡ قَالَ ٱللَّهُ مِن قَبۡلُۖ فَسَيَقُولُونَ بَلۡ تَحۡسُدُونَنَاۚ بَلۡ كَانُواْ لَا يَفۡقَهُونَ إِلَّا قَلِيلٗا ١٥
ఓ విశ్వాసపరులారా మీరు హుదేబియా ఒప్పందము తరువాత అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన ఖైబర్ విజయధనము గురించి మీరు వాటిని తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అల్లాహ్ వెనుక ఉంచిన వారు మీతో ఇలా పలుకుతారు : మీరు మమ్మల్ని వదలండి మేము దాని నుండి మా భాగమును పొందటానికి మీతో పాటు బయలుదేరుతాము. వెనుక ఉండిపోయిన వీరందరు తమ ఈ కోరిక వలన అల్లాహ్ హుదేబియ ఒప్పందము తరువాత విశ్వాసపరులకొక్కరికే ఖైబర్ విజయ ధనమును ఇస్తానని చేసిన వాగ్దానమును మార్చివేయాలనుకున్నారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : ఈ విజయ ధనము పొందటానికి మీరు మా వెంట రాకండి. నిశ్చయంగా అల్లాహ్ ఖైబర్ విజయ ధనమును ప్రత్యేకించి హుదేబియాలో హాజరు అయిన వారికి మాత్రమే ఇస్తానని మాకు వాగ్దానం చేశాడు. అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు : ఖైబర్ వైపునకు మేము మీ వెంట రావటం నుండి మీరు మమ్మల్ని ఆపటం అన్నది అల్లాహ్ ఆదేశం కాదు. అది మాపై మీ అసూయ వలన. మరియు విషయం వెనుక ఉండిపోయిన వీరందరు అనుకున్నట్లు కాదు. కాని వారందరు అల్లాహ్ ఆదేశములను మరియు ఆయన వారింపులను చాలా తక్కువగా అర్ధం చేసుకునేవారు. అందుకనే వారు ఆయనకు అవిధేయత చూపటంలో పడిపోయారు.