Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 16

قُل لِّلۡمُخَلَّفِينَ مِنَ ٱلۡأَعۡرَابِ سَتُدۡعَوۡنَ إِلَىٰ قَوۡمٍ أُوْلِي بَأۡسٖ شَدِيدٖ تُقَٰتِلُونَهُمۡ أَوۡ يُسۡلِمُونَۖ فَإِن تُطِيعُواْ يُؤۡتِكُمُ ٱللَّهُ أَجۡرًا حَسَنٗاۖ وَإِن تَتَوَلَّوۡاْ كَمَا تَوَلَّيۡتُم مِّن قَبۡلُ يُعَذِّبۡكُمۡ عَذَابًا أَلِيمٗا ١٦
ఓ ప్రవక్తా మీరు మీతో పాటు మక్కాకు బయలుదేరటం నుండి వెనుక ఉండిపోయిన పల్లె వాసులతో వారికే తెలియపరుస్తూ ఇలా పలకండి : మీరు తొందరలోనే యుద్దంలో తీవ్రంగా,బలంగా పోరాడే జాతితో యుద్దం చేయటానికి పిలవబడుతారు. మీరు వారిని అల్లాహ్ మార్గంలో వదిస్తారు లేదా వారు యుద్దం జరగకుండానే ఇస్లాంలో ప్రవేశిస్తారు. ఒక వేళ మీరు వారితో యుద్దం విషయంలో మీరు పిలవబడిన దాని విషయంలో అల్లాహ్ కు విధేయత చూపితే ఆయన మీకు మంచి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అది స్వర్గము. ఒక వేళ మీరు మక్కా వైపునకు ఆయనతో పాటు వెళ్ళటం నుండి వెనుక ఉండిపోయినప్పుడు విధేయత నుండి విముఖత చూపినట్లు ఆయన విధేయత నుండి విముఖత చూపితే ఆయన మీకు బాధాకరమైన శిక్షను కలిగిస్తాడు.