Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 24

وَهُوَ ٱلَّذِي كَفَّ أَيۡدِيَهُمۡ عَنكُمۡ وَأَيۡدِيَكُمۡ عَنۡهُم بِبَطۡنِ مَكَّةَ مِنۢ بَعۡدِ أَنۡ أَظۡفَرَكُمۡ عَلَيۡهِمۡۚ وَكَانَ ٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرًا ٢٤
మరియు ఆయనే మీ నుండి ముష్రికుల చేతులను హుదేబియాలో మీకు కీడుని కలిగించే ఉద్దేశముతో వారిలోని ఎనభై మంది వచ్చినప్పుడు ఆపాడు. మరియు వారి నుండి మీ చేతులను ఆపాడు అప్పుడు మీరు వారిని హతమార్చలేదు మరియు వారిని బాధించలేదు. వారిని బందీలుగా చేసుకునే సామర్ధ్యం ఉండి కూడా మీరు వారిని విడుదల చేశారు. మరియు అల్లాహ్ మీరు చేసేవాటిని చూస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.