Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 25

هُمُ ٱلَّذِينَ كَفَرُواْ وَصَدُّوكُمۡ عَنِ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ وَٱلۡهَدۡيَ مَعۡكُوفًا أَن يَبۡلُغَ مَحِلَّهُۥۚ وَلَوۡلَا رِجَالٞ مُّؤۡمِنُونَ وَنِسَآءٞ مُّؤۡمِنَٰتٞ لَّمۡ تَعۡلَمُوهُمۡ أَن تَطَـُٔوهُمۡ فَتُصِيبَكُم مِّنۡهُم مَّعَرَّةُۢ بِغَيۡرِ عِلۡمٖۖ لِّيُدۡخِلَ ٱللَّهُ فِي رَحۡمَتِهِۦ مَن يَشَآءُۚ لَوۡ تَزَيَّلُواْ لَعَذَّبۡنَا ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ عَذَابًا أَلِيمًا ٢٥
వారందరే అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచి,మిమ్మల్ని మస్జిదుల్ హరామ్ నుండి ఆపారు మరియు బలి పశువును దాని జుబాహ్ అయ్యే ప్రదేశమైన హరమ్ నకు చేరకుండా ఉండేటట్లు ఆపారు. మరియు ఒక వేళ అక్కడ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే పురుషులు,విశ్వాసమును కనబరిచే స్త్రీలు ఉండకుండా ఉంటే - మీరు వారిని గుర్తించకుండా ఉండి మీరు వారిని అవిశ్వాసపరులతో పాటు హతమార్చేసేవారు. వారిని మీరు మీకు తెలియకుండా హత్య చేసి ఉంటే మీకు పాపము మరియు రక్తపరిహారము కలిగి ఉండేది. కావున ఆయన మక్కా విజయము రోజు మీకు అనుమతినిచ్చాడు అల్లాహ్ మక్కాలోని విశ్వాసపరుల్లాంటి వారిలా తాను తలచిన వారిని తన కారుణ్యములో ప్రవేశింపజేస్తాడు. ఒక వేళ మక్కాలో విశ్వాసపరుల్లో నుంచి అవిశ్వాసపరులు వేరై ఉంటే అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై అవిశ్వాసమును కనబరచిన వారిని మేము బాధాకరమైన శిక్షకు గురి చేసేవారము.