Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 26

إِذۡ جَعَلَ ٱلَّذِينَ كَفَرُواْ فِي قُلُوبِهِمُ ٱلۡحَمِيَّةَ حَمِيَّةَ ٱلۡجَٰهِلِيَّةِ فَأَنزَلَ ٱللَّهُ سَكِينَتَهُۥ عَلَىٰ رَسُولِهِۦ وَعَلَى ٱلۡمُؤۡمِنِينَ وَأَلۡزَمَهُمۡ كَلِمَةَ ٱلتَّقۡوَىٰ وَكَانُوٓاْ أَحَقَّ بِهَا وَأَهۡلَهَاۚ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٗا ٢٦
అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు తమ హృదయముల్లో సత్య సాక్షాత్కారానికి సంబంధం లేకుండా కేవలం మనోవంఛలతో సంబంధం కల అజ్ఞాన కాలపు అహంభావమును పెంచుకున్నప్పుడు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశమును వారు తమను ఓడించి అపనిందలు వేస్తారనే భయముతో అసహ్యించుకున్నారు. అప్పుడు అల్లాహ్ తన వద్ద నుండి మనశ్శాంతిని తన ప్రవక్తపై అవతరింపజేశాడు మరియు దాన్ని విశ్వాసపరులపై అవతరింపజేశాడు. అయితే వారి మీద ఉన్న కోపము ముష్రికులతో పోరాటమును వారు చేసినట్లుగా కోరలేదు. మరియు అల్లాహ్ విశ్వాసపరులకి సత్య వాక్కు అది లా యిలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవము ఇంకొకరు లేడు) ను అనివార్యము చేశాడు. మరియు వారు దానికి తగినట్లుగా స్థిరంగా ఉండాలని అనివార్యము చేశాడు. అప్పుడు వారు దానిపై స్థిరంగా ఉన్నారు. మరియు విశ్వాసపరులు ఇతరులకన్న ఈ వాక్యమునకు ఎక్కువ హక్కుదారులు. అల్లాహ్ వారి హృదయముల్లో మంచితనమును తెలుసుకున్నప్పుడు వారే దానికి అర్హతకలిగే అర్హులు. మరియు అల్లాహ్ ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.