Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Fath — Ayah 27

لَّقَدۡ صَدَقَ ٱللَّهُ رَسُولَهُ ٱلرُّءۡيَا بِٱلۡحَقِّۖ لَتَدۡخُلُنَّ ٱلۡمَسۡجِدَ ٱلۡحَرَامَ إِن شَآءَ ٱللَّهُ ءَامِنِينَ مُحَلِّقِينَ رُءُوسَكُمۡ وَمُقَصِّرِينَ لَا تَخَافُونَۖ فَعَلِمَ مَا لَمۡ تَعۡلَمُواْ فَجَعَلَ مِن دُونِ ذَٰلِكَ فَتۡحٗا قَرِيبًا ٢٧
నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రవక్తకు కలను నిజం చేసి చూపించాడు. ఎప్పుడైతే ఆయన దాన్నే తన కలలో చూశారో తన సహచరులకు దాన్ని గురించి సమాచారమిచ్చారు. అదేమిటంటే నిశ్చయంగా ఆయన మరియు ఆయన అనుచరులు అల్లాహ్ పవిత్ర గృహములో తమ శతృవుల నుండి నిర్భయంగా ప్రవేసిస్తున్నారు. వారిలో నుండి కొందరు తమ శిరో ముండనం చేస్తున్నారు. మరియు వారిలో నుండి కొందరు ఖుర్బానీ ముగింపు గురించి ప్రకటిస్తూ వెంట్రుకలను కత్తిరిస్తున్నారు. ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీకు తెలియని మీ ప్రయోజనంను తెలుసుకున్నాడు. కావున ఆయన ఆ సంవత్సరం మక్కాలో ప్రవేశించటం ద్వారా కల నిరూపితం కాకుండానే దగ్గరలోనే విజయమును కలిగించాడు. మరియు అది అల్లాహ్ హుదైబియా సయోధ్యను జారీచేసి, మరియు దాని వెనువెంటనే హుదైబియాలో సమావేశమైన విశ్వాసపరుల చేతులపై ఖైబర్ పై విజయంను కలిగించి.