Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hujurat — Ayah 11

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا يَسۡخَرۡ قَوۡمٞ مِّن قَوۡمٍ عَسَىٰٓ أَن يَكُونُواْ خَيۡرٗا مِّنۡهُمۡ وَلَا نِسَآءٞ مِّن نِّسَآءٍ عَسَىٰٓ أَن يَكُنَّ خَيۡرٗا مِّنۡهُنَّۖ وَلَا تَلۡمِزُوٓاْ أَنفُسَكُمۡ وَلَا تَنَابَزُواْ بِٱلۡأَلۡقَٰبِۖ بِئۡسَ ٱلِٱسۡمُ ٱلۡفُسُوقُ بَعۡدَ ٱلۡإِيمَٰنِۚ وَمَن لَّمۡ يَتُبۡ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ١١
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీలో నుండి ఒక వర్గము ఇంకొక వర్గముని ఎగతాళి చేయకండి. బహుశా వారి ద్వారా ఎగతాళి చేయబడిన వారు అల్లాహ్ వద్ద గొప్పవారు కావచ్చు. అల్లాహ్ వద్ద ఉన్నదాని ద్వారా గుణపాఠం ఉన్నది. మరియు స్త్రీల్లోంచి కొందరు ఇంకొందరి స్త్రీలను ఎగతాళి చేయకూడదు బహుశా వారి ద్వారా ఎగతాళి చేయబడిన వారు అల్లాహ్ వద్ద గొప్పవారు కావచ్చు. మరియు మీరు మీ సహోదరులను నిందించకండి వారు మీలాంటి వారే. మరియు మీరు ద్వేషించుకునే మారు పేరుతో ఏ విధంగానైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాక మునుపు కొందరి అన్సారుల స్థితి ఉండేదో ఆ విధంగా ఒకరినొకరు పిలుచుకోకండి. మీలో నుండి ఎవరైతే ఇలా చేస్తారో వారు పాపాత్ములు. విశ్వాసము తరువాత పాప గుణము ఎంతో చెడ్డదైన గుణము. మరియు ఎవరైతే ఈ పాప కార్యముల నుండి పశ్ఛాత్తాప్పడరో వారందరు తాము పాల్పడిన పాప కార్యముల వలన వినాశన స్థానములకు చేరి తమ స్వయముపై దుర్మార్గమునకు పాల్పడినవారు.