Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hujurat — Ayah 12

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱجۡتَنِبُواْ كَثِيرٗا مِّنَ ٱلظَّنِّ إِنَّ بَعۡضَ ٱلظَّنِّ إِثۡمٞۖ وَلَا تَجَسَّسُواْ وَلَا يَغۡتَب بَّعۡضُكُم بَعۡضًاۚ أَيُحِبُّ أَحَدُكُمۡ أَن يَأۡكُلَ لَحۡمَ أَخِيهِ مَيۡتٗا فَكَرِهۡتُمُوهُۚ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ تَوَّابٞ رَّحِيمٞ ١٢
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని అనుసరించేవారా మీరు తగిన కారణాలు మరియు ఆధారాలు లేని అనేక ఆరోపణల నుండి దూరంగా ఉండండి. నిశ్చయంగా కొన్ని అనుమానాలు బాహ్యంగా ప్రయోజనం కలిగించేవాడి విషయంలో దురాలోచన లాంటివి పాపములవుతాయి. మరియు మీరు విశ్వాసపరుల రహస్యాలను వారి చాటునుండి తెలుసుకోవటానికి అనుసరించకండి. మరియు మీలో నుండి ఏ ఒక్కరు కూడా తన సోదరుడు ఇష్టపడని వాటి గురించి చర్చించకండి. ఎందుకంటే అతడు ఇష్టపడని దాని గురించి చర్చించటం అతని మృత శరీరం నుండి మాంసమును తిన్నట్లే. ఏమి మీ లో నుండి ఎవరైన తన సోదరుని మృత శరీరము నుండి మాంసమును తినటం ఇష్టపడుతాడా ?. మీరు ఇష్టపడరు అతని చాడీలు చెప్పటము దాని లాంటిదే. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడేవారిని మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.