Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hujurat — Ayah 13

يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنَّا خَلَقۡنَٰكُم مِّن ذَكَرٖ وَأُنثَىٰ وَجَعَلۡنَٰكُمۡ شُعُوبٗا وَقَبَآئِلَ لِتَعَارَفُوٓاْۚ إِنَّ أَكۡرَمَكُمۡ عِندَ ٱللَّهِ أَتۡقَىٰكُمۡۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٞ ١٣
ఓ ప్రజలారా నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒకే పురుషుడు మీ తండ్రి అయిన ఆదమ్ మరియి ఒకే స్త్రీ మీ తల్లి అయిన హవ్వాతో సృష్టించాము. కావున మీ వంశము ఒక్కటే. కాబట్టి మీరు వంశం విషయంలో ఒకరిపై ఒకరు గర్వించకండి. మరియు మేము దాని తరువాత మిమ్మల్ని చాలా వర్గములుగా మరియు విస్తరించిన తెగలుగా చేశాము మీరు ఒకరినొకరు గుర్తించుకోవటానికి దానిపై గర్వించటానికి కాదు. ఎందుకంటే వ్యత్యాసం అనేది దైవభీతి పరంగా మాత్రమే ఉంటుంది. అందుకనే ఆయన (అల్లాహ్) ఇలా పలికాడు : నిశ్చయంగా మీలో ఎక్కువ దైవభీతి కలవాడే అల్లాహ్ వద్ద మీలో ఎక్కువ గౌరవం కలవాడు. నిశ్చయంగా అల్లాహ్ మీ పరిస్థితుల గురించి తెలిసినవాడు, మీలో ఉన్న పరిపూర్ణతను,లోపమను తెలుసుకునేవాడు. దానిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.