Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hujurat — Ayah 14

۞ قَالَتِ ٱلۡأَعۡرَابُ ءَامَنَّاۖ قُل لَّمۡ تُؤۡمِنُواْ وَلَٰكِن قُولُوٓاْ أَسۡلَمۡنَا وَلَمَّا يَدۡخُلِ ٱلۡإِيمَٰنُ فِي قُلُوبِكُمۡۖ وَإِن تُطِيعُواْ ٱللَّهَ وَرَسُولَهُۥ لَا يَلِتۡكُم مِّنۡ أَعۡمَٰلِكُمۡ شَيۡـًٔاۚ إِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ ١٤
కొందరు పల్లెవాసులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినప్పుడు ఇలా పలికారు : మేము అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచాము. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : మీరు విశ్వసించ లేదు, కాని మీరు మేము విధేయులయ్యాము మరియు కట్టుబడి ఉన్నాము అని పలకండి. మీ హృదయముల్లో ఇంకా విశ్వాసము ప్రవేశించలేదు. మరియు అది వాటిలో ప్రవేశిస్తుందని ఆశించవచ్చు. ఓ పల్లెవాసుల్లారా ఒక వేళ మీరు విశ్వసించే విషయంలో,సత్కర్మలు చేయటంలో,నిషిద్దతాల నుండి దూరంగా ఉండటంలో అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను అనుసరిస్తే అల్లాహ్ మీ కర్మల ప్రతిఫలము నుండి ఏమాత్రం మీకు తగ్గించడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛచత్తాప్పడేవారిని మన్నించేవాడును మరియు వారిపై కనికరించేవాడును.