Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 10

وَمَا لَكُمۡ أَلَّا تُنفِقُواْ فِي سَبِيلِ ٱللَّهِ وَلِلَّهِ مِيرَٰثُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ لَا يَسۡتَوِي مِنكُم مَّنۡ أَنفَقَ مِن قَبۡلِ ٱلۡفَتۡحِ وَقَٰتَلَۚ أُوْلَٰٓئِكَ أَعۡظَمُ دَرَجَةٗ مِّنَ ٱلَّذِينَ أَنفَقُواْ مِنۢ بَعۡدُ وَقَٰتَلُواْۚ وَكُلّٗا وَعَدَ ٱللَّهُ ٱلۡحُسۡنَىٰۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ١٠
అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం నుండి మిమ్మల్ని ఏది ఆపుతుంది ?! మరియు ఆకాశముల మరియు భూమి యొక్క వారసత్వము అల్లాహ్ కే చెందుతుంది. ఓ విశ్వాసపరులారా మక్కా పై విజయం కన్న ముందు అల్లాహ్ మార్గములో ఆయన మన్నతను ఆశిస్తూ తన సంపదను ఖర్చు చేసి,ఇస్లాంకు మద్దతు కొరకు అవిశ్వాసపరులతో పోరాడినవారు మక్కా విజయము తరువాత ఖర్చు చేసి,అవిశ్వాసపరులతో పోరాడిన వారితో సమానం కాజాలరు. విజయం కన్న ముందు ఖర్చు చేసినవారు మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వారందరు దాని విజయం తరువాత తమ సంపదలను అల్లాహ్ మార్గములో ఖర్చు చేసి,అవిశ్వాసపరులతో పోరాడిన వారికన్న అల్లాహ్ వద్ద గొప్ప స్థానము కలవారు. వాస్తవానికి అల్లాహ్ ఇరు వర్గముల కొరకు స్వర్గపు వాగ్దానం చేశాడు. మీరు చేస్తున్నది అల్లాహ్ కు తెలుసు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.