Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 20

ٱعۡلَمُوٓاْ أَنَّمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا لَعِبٞ وَلَهۡوٞ وَزِينَةٞ وَتَفَاخُرُۢ بَيۡنَكُمۡ وَتَكَاثُرٞ فِي ٱلۡأَمۡوَٰلِ وَٱلۡأَوۡلَٰدِۖ كَمَثَلِ غَيۡثٍ أَعۡجَبَ ٱلۡكُفَّارَ نَبَاتُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصۡفَرّٗا ثُمَّ يَكُونُ حُطَٰمٗاۖ وَفِي ٱلۡأٓخِرَةِ عَذَابٞ شَدِيدٞ وَمَغۡفِرَةٞ مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٞۚ وَمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَآ إِلَّا مَتَٰعُ ٱلۡغُرُورِ ٢٠
ఇహలోక జీవితం శరీరములు ఆడుకునే ఒక ఆట అని మరియు హృదయములు వినోదం పొందే ఒక వినోదమని మరియు మీరు అలంకరించుకునే ఒక అలంకరణ అని మీరు తెలుసుకోండి. అందులో ఉన్న అధికారము మరియు ప్రయోజన సామగ్రితో మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవటం మరియు సంపదలు అధికముగా ఉండటం వలన,సంతానము ఎక్కువగా ఉండటం వలన ప్రగల్బాలు పలకటం. ఆ వర్షపు ఉపమానము మాదిరిగా ఉన్నది దాని మొక్కలు రైతులకు ఆనందం కలిగిస్తాయి. ఆ పిదప ఆ పచ్చటి మొక్కలు ఎండిపోకుండా ఉండవు. ఓ చూసే వాడా నీవు దాన్ని పచ్చగా అయిన తరువాత పసుపుగా చూస్తావు. ఆ తరువాత అల్లాహ్ దాన్ని ముక్కలు ముక్కలుగా అయిన పొట్టు వలె చేస్తాడు. మరియు పరలోకములో అవిశ్వాసపరులకు,కపటులకు కఠినమైన శిక్ష కలదు. మరియు అల్లాహ్ వద్ద నుండి విశ్వాసపరులైన తన దాసుల పాపములకు మన్నింపు మరియు ఆయన మన్నత కలదు. మరియు ఇహలోక జీవితం స్థిరత్వం లేని తరగిపోయే సామగ్రి మాత్రమే. ఎవరైతే తరిగి పోయే దాని సామగ్రికి పరలోక అనుగ్రహాలపై ప్రాధాన్యతనిస్తాడో అతడు మోసపోయి నష్టపోయేవాడు.