Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 27

ثُمَّ قَفَّيۡنَا عَلَىٰٓ ءَاثَٰرِهِم بِرُسُلِنَا وَقَفَّيۡنَا بِعِيسَى ٱبۡنِ مَرۡيَمَ وَءَاتَيۡنَٰهُ ٱلۡإِنجِيلَۖ وَجَعَلۡنَا فِي قُلُوبِ ٱلَّذِينَ ٱتَّبَعُوهُ رَأۡفَةٗ وَرَحۡمَةٗۚ وَرَهۡبَانِيَّةً ٱبۡتَدَعُوهَا مَا كَتَبۡنَٰهَا عَلَيۡهِمۡ إِلَّا ٱبۡتِغَآءَ رِضۡوَٰنِ ٱللَّهِ فَمَا رَعَوۡهَا حَقَّ رِعَايَتِهَاۖ فَـَٔاتَيۡنَا ٱلَّذِينَ ءَامَنُواْ مِنۡهُمۡ أَجۡرَهُمۡۖ وَكَثِيرٞ مِّنۡهُمۡ فَٰسِقُونَ ٢٧
ఆ తరువాత మేము మా ప్రవక్తలను ఒకరి తరువాత ఒకరిని పంపించాము. మేము వారిని వారి సమాజాల వద్దకు క్రమక్రమంగా పంపాము. మరియు మేము వారి వెనుక మర్యమ్ కుమారుడగు ఈసాను పంపాము. మరియు ఆయనకు మేము ఇంజీలును ప్రసాదించాము. మరియు మేము ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించిన వారి హృదయములలో దయను,కరుణను కలిగించాము. అయితే వారు పరస్పరం ప్రేమించుకునే వారు మరియు దయ చూపుకునేవారు. మరియు వారు తమ ధర్మ విషయంలో అతిక్రమించటమును ఆరంభించారు. అప్పుడు వారు అల్లాహ్ వారికి ధర్మ సమ్మతం చేసిన నికాహ్,రుచి కరమైన వస్తువులను కొన్నింటిని వదిలివేశారు. మరియు మేము దాన్ని వారి నుండి కోరలేదు. వారు దాన్ని స్వయంగా తమపై తప్పనిసరి చేసుకున్నారు ; ధర్మంలో వారి తరపు నుండి కొత్తపొకడగా. కాని మేము మాత్రం అల్లాహ్ కు ఇష్టమైన వాటిని కోరాము వారు చేయలేదు. మేము వారిలోంచి విశ్వసించిన వారిని వారి ప్రతిఫలమును ప్రసాదించాము. వారిలో నుండి చాలా మంది ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించి అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయినారు.