Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 28

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَءَامِنُواْ بِرَسُولِهِۦ يُؤۡتِكُمۡ كِفۡلَيۡنِ مِن رَّحۡمَتِهِۦ وَيَجۡعَل لَّكُمۡ نُورٗا تَمۡشُونَ بِهِۦ وَيَغۡفِرۡ لَكُمۡۚ وَٱللَّهُ غَفُورٞ رَّحِيمٞ ٢٨
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మీ విశ్వాసము మరియు పూర్వ ప్రవక్తలపై మీ విశ్వాసము వలన మీకు రెండు భాగములు పుణ్యము,ప్రతిఫలము ప్రసాదిస్తాడు. మరియు మీకు ఒక వెలుగును ప్రసాదిస్తాడు దాని ద్వారా మీరు మీ ఇహలోక జీవితంలో మార్గం పొందుతారు మరియు ప్రళయదినమును సిరాత్ వంతెన పై వెలుగును పొందుతారు. మరియు ఆయన మీ కొరకు మీ పాపములను మన్నించి వాటిపై పరదా కప్పివేస్తాడు. మరియు మిమ్మల్ని వాటి పరంగా శిక్షించడు. పరిశుద్ధుడైన అల్లాహ్ తన దాసులను మన్నించేవాడును మరియు వారిపై అపారంగా కరుణించేవాడును.