Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 14

۞ أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ تَوَلَّوۡاْ قَوۡمًا غَضِبَ ٱللَّهُ عَلَيۡهِم مَّا هُم مِّنكُمۡ وَلَا مِنۡهُمۡ وَيَحۡلِفُونَ عَلَى ٱلۡكَذِبِ وَهُمۡ يَعۡلَمُونَ ١٤
ఓ ప్రవక్తా తమ అవిశ్వాసము వలన మరియు తమ పాప కార్యముల వలన అల్లాహ్ ఆగ్రహమునకు గురి అయిన యూదులతో స్నేహం చేసిన కపటులను మీరు గమనించ లేదా. ఈ కపటులందరు విశ్వాసపరుల్లోంచి కారు మరియు యూదులలోంచి కారు. కాని వారు వీరందరి వైపున కాకుండా మరియు వారందరి వైపున కాకుండా తటస్తము లేకుండా తిరుగుతున్నారు. మరియు తాము ముస్లిములని మరియు తాము ముస్లిముల సమాచారములను యూదులకు చేరవేయటం లేదని ప్రమాణాలు చేస్తున్నారు. వారు తమ ప్రమాణం చేయటంలో అసత్యము పలుకుతున్నారు.