Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 13

ءَأَشۡفَقۡتُمۡ أَن تُقَدِّمُواْ بَيۡنَ يَدَيۡ نَجۡوَىٰكُمۡ صَدَقَٰتٖۚ فَإِذۡ لَمۡ تَفۡعَلُواْ وَتَابَ ٱللَّهُ عَلَيۡكُمۡ فَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَأَطِيعُواْ ٱللَّهَ وَرَسُولَهُۥۚ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ ١٣
ఏమీ మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రహస్యంగా మాట్లాడినప్పుడు ముందస్తు దానం చేయటం వలన పేదరికం నుండి భయపడిపోయారా ?! అల్లాహ్ ఆదేశించిన వాటిని మీరు చేయలేకపోయినప్పుడు ఆయన మీపై దయ చూపాడు అందుకనే ఆయన వాటిని వదిలి వేయటానికి మీకు అనుమతిచ్చాడు. కాబట్టి మీరు నమాజును పరిపూర్ణ పద్ధతిలో పాటించండి మరియు మీ సంపదల జకాతును చెల్లించండి మరియు అల్లాహ్ కు,ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. మరియు మీరు చేసేది అల్లాహ్ కు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.