Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 12

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نَٰجَيۡتُمُ ٱلرَّسُولَ فَقَدِّمُواْ بَيۡنَ يَدَيۡ نَجۡوَىٰكُمۡ صَدَقَةٗۚ ذَٰلِكَ خَيۡرٞ لَّكُمۡ وَأَطۡهَرُۚ فَإِن لَّمۡ تَجِدُواْ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ ١٢
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లముతో రహస్య మంతనాలు చేసేవారు అనుచరులు చాలామంది కావటంతో అల్లాహ్ ఇలా పలికాడు : ఓ విశ్వాసపరులారా మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రహస్యంగా మాట్లాడదలచుకుంటే మీ రహస్యంగా మాట్లాడటం కన్న ముందు ఏమైన దానం చేయండి. ముందస్తు దానం చేయటం హృదయములను పరిశుద్ధపరిచే అల్లాహ్ పై విధేయత అందులో ఉండటం వలన మీ కొరకు ఎంతో ఉత్తమమైనది మరియు ఎంతో పరిశుద్ధమైనది. మీరు దానం చేయవలసినది మీరు పొందకపోతే ఆయనతో రహస్యంగా మాట్లాడటంలో మీపై ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే అల్లాహ్ తన దాసుల పాపములను మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును. అందుకనే ఆయన వారిపై వారి శక్తికి మించి భారం వేయలేదు.