ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్దం చేసిన వాటిని ఆచరించేవారా మిమ్మల్ని కూర్చున్న ప్రదేశముల్లో విశాలమై కూర్చోమని పలకబడినప్పుడు మీరు విశాలమై కూర్చోండి అల్లాహ్ మీ ఇహలోక జీవితంలో మరియు పరలోకంలో మీకు విశాలమును కలిగిస్తాడు. మరియు మిమ్మల్ని కొన్ని కూర్చునే ప్రదేశముల నుండి అక్కడ గొప్ప వారు కూర్చోవటానికి లెగమంటే మీరు అక్కడ నుండి లేవండి. పరిశుద్ధుడైన అల్లాహ్ మీలో నుండి విశ్వసించిన వారిని మరియు జ్ఞానము ప్రసాదించబడిన వారిని గొప్ప స్థానములకు పెంచుతాడు. మరియు మీరు చేసేవన్ని అల్లాహ్ తెలుసుకునేవాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.