Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 11

۞ أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ نَافَقُواْ يَقُولُونَ لِإِخۡوَٰنِهِمُ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَئِنۡ أُخۡرِجۡتُمۡ لَنَخۡرُجَنَّ مَعَكُمۡ وَلَا نُطِيعُ فِيكُمۡ أَحَدًا أَبَدٗا وَإِن قُوتِلۡتُمۡ لَنَنصُرَنَّكُمۡ وَٱللَّهُ يَشۡهَدُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ ١١
ఓ ప్రవక్తా అవిశ్వాసమును గోప్యంగా ఉంచి విశ్వాసమును బయటకు చూపే వారిని మీరు గమనించలేదా వారు అవిశ్వాసంలో తమ సోదరులైన మార్పు చేర్పులు చేయబడిన తౌరాత్ ను అనుసరించే యూదులతో ఇలా పలుకుతున్నారు : మీరు మీ ఇండ్లలోనే స్థిరంగా ఉండండి మేము మిమ్మల్ని నిస్సహాయులుగా వదిలివేయము. మరియు మేము మిమ్మల్ని అప్పజప్పము. ఒక వేళ ముస్లిములు మిమ్మల్ని వాటి నుండి వెళ్ళగొడితే మేము కూడా మీతో పాటు కలిసి బయటకు వస్తాము. మేము మీతో పాటు బయటకు రావటం నుండి మమ్మల్ని ఆపదలచిన వారి ఎవరి మాట వినము. మరియు ఒకవేళ వారు మీతో పోరాడితే మేము వారికి వ్యతిరేకంగా మీకు సహాయం చేస్తాము. మరియు నిశ్ఛయంగా యూదులు వెళ్ళగొట్టబడినప్పుడు వారితో పాటు బయలు దేరుతారని మరియు వారితో యుద్దం చేయబడినప్పుడు వారితో కలసి యుద్దం చేస్తారని చేసిన వాగ్దానములో కపటులు అబద్దం పలుకుతున్నారని అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడు.