Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 10

وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعۡدِهِمۡ يَقُولُونَ رَبَّنَا ٱغۡفِرۡ لَنَا وَلِإِخۡوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلۡإِيمَٰنِ وَلَا تَجۡعَلۡ فِي قُلُوبِنَا غِلّٗا لِّلَّذِينَ ءَامَنُواْ رَبَّنَآ إِنَّكَ رَءُوفٞ رَّحِيمٌ ١٠
మరియు వీరందరి తరువాత ఎవరైతే వచ్చి ప్రళయ దినము వరకు వారిని మంచితో అనుసరిస్తారో వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మమ్మల్ని మరియు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై మా కన్నా ముందు విశ్వాసము కనబరచిన వారైన ధర్మ విషయంలో మా సోదరులైన వారిని మన్నించు. విశ్వాసపరుల్లోంచి ఎవరి కొరకు కూడా మా హృదయములలో ద్వేషమును కాని పగను కాని కలిగించకు. ఓ మా ప్రభువా నిశ్ఛయంగా నీవు నీ దాసులపై దయ చూపేవాడివి, వారిపై కరుణించేవాడివి.