Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 9

وَٱلَّذِينَ تَبَوَّءُو ٱلدَّارَ وَٱلۡإِيمَٰنَ مِن قَبۡلِهِمۡ يُحِبُّونَ مَنۡ هَاجَرَ إِلَيۡهِمۡ وَلَا يَجِدُونَ فِي صُدُورِهِمۡ حَاجَةٗ مِّمَّآ أُوتُواْ وَيُؤۡثِرُونَ عَلَىٰٓ أَنفُسِهِمۡ وَلَوۡ كَانَ بِهِمۡ خَصَاصَةٞۚ وَمَن يُوقَ شُحَّ نَفۡسِهِۦ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ ٩
మరియు ముహాజిర్ ల కన్నా ముందు నుండే మదీనాలో చోటు చేసుకున్న అన్సారులు, వారు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును ఎంచుకున్నారు. వారు మక్కా నుండి తమ వద్దకు వలస వచ్చిన వారిని ఇష్టపడుతారు. మరియు వారు ఫై నుండి తమకు ఇవ్వకుండా అల్లాహ్ మార్గములో హిజ్రత్ చేసిన వారికి ఏదైన ఇవ్వబడితే తమ హృదయములలో ఎటువంటి కోపమును గాని ఎటువంటి అసూయను గాని పొందరు. మరియు వారు ప్రాపంచిక భాగములలో ముహాజిర్ లను తమ కన్నా ముందు ఉంచుతారు. ఒక వేళ వారికి పేదరికము, అవసరం కలిగినా సరే. మరియు అల్లాహ్ ఎవరినైతే సంపదపై అత్యాశ నుండి రక్షిస్తాడో అతడు దాన్ని ఆయన మార్గములో ఖర్చు చేస్తాడు. కావున వారందరే తాము ఆశించిన దాన్ని పొంది,తాము భయపడే వాటి నుండి విముక్తి పొంది సాఫల్యం చెందుతారు.