Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 2

هُوَ ٱلَّذِيٓ أَخۡرَجَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ مِن دِيَٰرِهِمۡ لِأَوَّلِ ٱلۡحَشۡرِۚ مَا ظَنَنتُمۡ أَن يَخۡرُجُواْۖ وَظَنُّوٓاْ أَنَّهُم مَّانِعَتُهُمۡ حُصُونُهُم مِّنَ ٱللَّهِ فَأَتَىٰهُمُ ٱللَّهُ مِنۡ حَيۡثُ لَمۡ يَحۡتَسِبُواْۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ ٱلرُّعۡبَۚ يُخۡرِبُونَ بُيُوتَهُم بِأَيۡدِيهِمۡ وَأَيۡدِي ٱلۡمُؤۡمِنِينَ فَٱعۡتَبِرُواْ يَٰٓأُوْلِي ٱلۡأَبۡصَٰرِ ٢
ఆయనే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తిరస్కరించి బనూ నజీర్ ను మదీనాలో ఉన్న వారి నివాసముల నుండి వారిని మదీనా నుండి షామ్ (సిరియా) వైపునకు మొదటి సారి వెలివేయటం కొరకు వెలివేశాడు. మరియు వారు తౌరాత్ ను కలిగిన యూదుల్లోంచి వారు. వారు తమ ఒప్పందమును భంగపరచి,ఆయనకు వ్యతిరేకముగా ముష్రికులతో సత్సంబంధాలు కలిగిన తరువాత. ఆయన వారిని షామ్ ప్రాంతము వైపునకు వెలివేశాడు. ఓ విశ్వాసపరులారా వారు కలిగిన ఆధిక్యత మరియు రక్షణ వలన వారు తమ నివాసముల నుండి భయటకు వస్తారని మీరు అనుకోలేదు. మరియు వారు నిర్మించుకున్న వారి కోటలు మరియు వారి రక్షణాలయములు అల్లాహ్ యాతన,ఆయన శిక్ష నుండి తమను రక్షిస్తాయని వారు భావించారు. అప్పుడు అల్లాహ్ శిక్ష ఆయన తన ప్రవక్తను వారితో పోరాడమని,వారిని వెలివేయమని ఆదేశించినప్పుడు వారు దాని వచ్చే చోటును ఊహించని విధంగా వారిపై వచ్చిపడినది. మరియు అల్లాహ్ వారి హృదయముల్లో తీవ్రమైన భయమును కలిగించాడు. వారు తమ నివాసములను ముస్లిములు వాటితో ప్రయోజనం చెందకుండా ఉండటానికి లోపలి నుండి తమ చేతులతో పడగొట్టసాగారు. మరియు ముస్లిములు వాటిని వెలుపల నుండి పడగొట్టసాగారు. కాబట్టి కళ్లు ఉన్నవారలారా వారి అవిశ్వాసం వలన వారిపై కలిగిన దాని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకోండి. మీరు వారిలా అవ్వకండి. అటువంటప్పుడు వారు శిక్షంచబడిన వారి ప్రతిఫలము,వారి శిక్షను మీరు పొందుతారు.