Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 22

هُوَ ٱللَّهُ ٱلَّذِي لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ عَٰلِمُ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِۖ هُوَ ٱلرَّحۡمَٰنُ ٱلرَّحِيمُ ٢٢ هُوَ ٱللَّهُ ٱلَّذِي لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡمَلِكُ ٱلۡقُدُّوسُ ٱلسَّلَٰمُ ٱلۡمُؤۡمِنُ ٱلۡمُهَيۡمِنُ ٱلۡعَزِيزُ ٱلۡجَبَّارُ ٱلۡمُتَكَبِّرُۚ سُبۡحَٰنَ ٱللَّهِ عَمَّا يُشۡرِكُونَ ٢٣
ఆయనే అల్లాహ్ ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. గోప్యంగా ఉన్న వాటిని మరియు బహిర్గతమై ఉన్నవాటిని ఎరిగినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఇహపరాల కరుణామయుడు మరియు వాటిలో కృపాశీలుడు. ఆయన కారుణ్యము సర్వలోకాలను విస్తరించి ఉన్నది. రాజాధిరాజు,ప్రతీ లోపము నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. ప్రతీ లోపము నుండి భద్రమైన వాడు. అద్భుత ఆయతులతో తన ప్రవక్తలను దృవీకరించేవాడు. తన దాసుల కర్మలపై పరిరక్షకుడు.ఎవరు ఓడించని సర్వశక్తిమంతుడు. తన పరాక్రమతో ప్రతీ వస్తువుపై ఆధిక్యతను చూపే పరాక్రమవంతుడు. పెద్దరికం గలవాడు.అల్లాహ్ ముష్రికులు ఆయనతో పాటు సాటి కల్పించే విగ్రహాలు ఇతరవాటి నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు.