Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 21

لَوۡ أَنزَلۡنَا هَٰذَا ٱلۡقُرۡءَانَ عَلَىٰ جَبَلٖ لَّرَأَيۡتَهُۥ خَٰشِعٗا مُّتَصَدِّعٗا مِّنۡ خَشۡيَةِ ٱللَّهِۚ وَتِلۡكَ ٱلۡأَمۡثَٰلُ نَضۡرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَفَكَّرُونَ ٢١
ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏదైన పర్వతంపైనైనా అవతరింపజేస్తే ఓ ప్రవక్తా మీరు ఆ పర్వతమును అది దృఢముగా ఉండి కూడా అల్లాహ్ యొక్క తీవ్ర భయం వలన అణిగిపోయి బ్రద్దలైపోవటమును చూస్తారు. ఖుర్ఆన్ లో కల హితోపదేశముల హెచ్చరికలు మరియు తీవ్ర బెదిరింపుల వలన. మరియు మేము ఈ ఉపమానములను ప్రజలకు విశదపరుస్తున్నాము బహుశా వారు తమ బుద్దులను ఆచరణలో పెట్టి దాని ఆయతులలో పొందుపరచబడిన హితోపదేశములతో,గుణపాఠములతో హితోపదేశం గ్రహిస్తారని.