Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 6

وَمَآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنۡهُمۡ فَمَآ أَوۡجَفۡتُمۡ عَلَيۡهِ مِنۡ خَيۡلٖ وَلَا رِكَابٖ وَلَٰكِنَّ ٱللَّهَ يُسَلِّطُ رُسُلَهُۥ عَلَىٰ مَن يَشَآءُۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ٦
బనూ నజీర్ సంపదల్లోంచి అల్లాహ్ ఏదైతే తన ప్రవక్తకు అందజేశాడో దాన్ని పొందే విషయంలో మీరు సవారి చేసే గుఱ్రములను గాని ఒంటెలను గాని మీరు పరుగెత్తించలేదు. మరియు ఆ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. కానీ అల్లాహ్ తాను తలచుకున్న వారిపై తన ప్రవక్తలకు ఆధిక్యతను ప్రసాదిస్తాడు. వాస్తవానికి ఆయన తన ప్రవక్తకు బనూ నజీర్ పై ఆధిక్యతను ప్రసాదించాడు. కాబట్టి ఆయన ఎటువంటి యుద్దం లేకుండానే వారి బస్తీలపై విజయం పొందారు. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సమర్ధుడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.