Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 7

مَّآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنۡ أَهۡلِ ٱلۡقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِي ٱلۡقُرۡبَىٰ وَٱلۡيَتَٰمَىٰ وَٱلۡمَسَٰكِينِ وَٱبۡنِ ٱلسَّبِيلِ كَيۡ لَا يَكُونَ دُولَةَۢ بَيۡنَ ٱلۡأَغۡنِيَآءِ مِنكُمۡۚ وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمۡ عَنۡهُ فَٱنتَهُواْۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ٧
అల్లాహ్ బస్తీ వాసుల సంపదల్లోంచి ఏదైతే తన ప్రవక్తకు ఎటువంటి యుద్దం లేకుండా అనుగ్రహించాడో అది అల్లాహ్ కు చెందినది. ఆయన దాన్ని తాను తలచిన వారికి ఇస్తాడు. మరియు ప్రవక్తకు అధికారం కలదు. మరియు ఆయన బంధువులైన హాషిమ్ సంతతి మరియు ముత్తలిబ్ సంతతి కొరకు అధికారము కలదు అది వారు సదఖా నుండి ఆపబడిన దానికి బదులుగా. మరియు అనాధులకి,పేదవారికి మరియు తన ఖర్చులను కోల్పోయిన బాటసారికి అధికారం కలదు. సంపద పేదవారికి కాకుండా ధనికుల్లోనే ప్రత్యేకించి తిరగకుండా ఉండటానికి. ఓ విశ్వాసపరులారా ఫై సంపదలలోంచి మీకు ప్రవక్త ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి మరియు ఆయన మీకు ఆపిన దాని నుండి మీరు ఆగిపోండి. మరియు మీరు అల్లాహ్ ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతూ ఉండండి. నిశ్ఛయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించే వాడు కాబట్టి మీరు ఆయన శిక్ష నుండి జాగ్రత్తపడండి.