Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hadid — Ayah 4

هُوَ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يَعۡلَمُ مَا يَلِجُ فِي ٱلۡأَرۡضِ وَمَا يَخۡرُجُ مِنۡهَا وَمَا يَنزِلُ مِنَ ٱلسَّمَآءِ وَمَا يَعۡرُجُ فِيهَاۖ وَهُوَ مَعَكُمۡ أَيۡنَ مَا كُنتُمۡۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ٤
ఆయనే భూమ్యాకాశములను ఆరుదినములలో ఆదివారము ఆరంభమై శుక్రువారము ముగిసినట్లుగా సృష్టించాడు. మరియు కనురెప్ప వాల్చే సమయం కన్న తక్కువ సమయంలో వాటిని సృష్టించే సామర్ధ్యం కలవాడు ఆయన. ఆ తరువాత పరిశుద్ధుడైన ఆయన సింహాసనమును ఆయన సుబహానహు వతఆలాకి తగిన విధంగా అధీష్టించి ఆశీనుడైనాడు. భూమిలో ప్రవేశించే వర్షము,విత్తనము మరియు మొదలైనవి మరియు దాని నుండి వెలికి వచ్చే మొక్కలు,నిక్షేపాలు మొదలైనవి మరియు ఆకాశము నుండి దిగే వర్షము,దైవవాణి మొదలైనవి మరియు అందులో ఎక్కే దైవ దూతలు,దాసుల కర్మలు,వారి ఆత్మల గురించి ఆయనకు తెలుసు. ఓ ప్రజలారా మీరు ఎక్కడున్నా ఆయన తన జ్ఞానము ద్వారా మీతో పాటు ఉంటాడు. మీ నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు అల్లాహ్ మీరు చేసే వాటిని వీక్షిస్తున్నాడు. మీ కర్మల్లో నుంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.