Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 2

ٱلَّذِينَ يُظَٰهِرُونَ مِنكُم مِّن نِّسَآئِهِم مَّا هُنَّ أُمَّهَٰتِهِمۡۖ إِنۡ أُمَّهَٰتُهُمۡ إِلَّا ٱلَّٰٓـِٔي وَلَدۡنَهُمۡۚ وَإِنَّهُمۡ لَيَقُولُونَ مُنكَرٗا مِّنَ ٱلۡقَوۡلِ وَزُورٗاۚ وَإِنَّ ٱللَّهَ لَعَفُوٌّ غَفُورٞ ٢
ఎవరైతే తమ భార్యలతో జిహార్ చేస్తారో వారిలో నుండి ఎవరైన తమ భార్యతో "నీవు నా వద్ద నా తల్లి వీపు లాంటి దానివి" అని పలికి (జిహార్ చేస్తారో) వారు తమ ఈ మాటలో అబద్దము పలికారు. ఎందుకంటే వారి భార్యలు వారి తల్లులు కారు. నిశ్ఛయంగా వారిని జన్మనిచ్చిన వారు వారి తల్లులు. మరియు వారు మాత్రం ఈ మాటను పలికినప్పుడు అత్యంత నీచమైన మాటను,అబద్దమును పలికినారు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ మన్నించేవాడును,క్షమించేవాడును. నిశ్ఛయంగా ఆయన వారికి పాపము నుండి ముక్తిగా పాప పరిహారమును వారి కొరకు ధర్మబద్దం చేశాడు.