Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 4

فَمَن لَّمۡ يَجِدۡ فَصِيَامُ شَهۡرَيۡنِ مُتَتَابِعَيۡنِ مِن قَبۡلِ أَن يَتَمَآسَّاۖ فَمَن لَّمۡ يَسۡتَطِعۡ فَإِطۡعَامُ سِتِّينَ مِسۡكِينٗاۚ ذَٰلِكَ لِتُؤۡمِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦۚ وَتِلۡكَ حُدُودُ ٱللَّهِۗ وَلِلۡكَٰفِرِينَ عَذَابٌ أَلِيمٌ ٤
ఎవరైతే మీలో నుండి బానిసను విముక్తి చేయటానికి పొందని వారిపై తాము జిహార్ చేసిన తమ భార్యతో సంబోగం చేయక ముందు క్రమం తప్పకుండా రెండు నెలల ఉపవాసముండాలి. ఎవరికైతే దాని శక్తి లేదో వారు అరవై మంది నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేయాలి. మేము నిర్దేశించిన ఈ ఆదేశము అల్లాహ్ దాన్ని ఆదేశించాడని మీరు విశ్వసించి ఆయన ఆదేశమును మీరు పాటించాలని. మేము మీ కొరకు ధర్మ బద్ధం చేసిన ఈ ఆదేశములు అల్లాహ్ తన దాసుల కొరకు చేసిన హద్దులు. కాబట్టి మీరు వాటిని అతిక్రమించకండి. అల్లాహ్ ఆదేశములను మరియు ఆయన నిర్ణయించిన హద్దులను తిరస్కరించే వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు.