Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 6

يَوۡمَ يَبۡعَثُهُمُ ٱللَّهُ جَمِيعٗا فَيُنَبِّئُهُم بِمَا عَمِلُوٓاْۚ أَحۡصَىٰهُ ٱللَّهُ وَنَسُوهُۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدٌ ٦
ఆరోజు అల్లాహ్ వారందరిని మరల లేపుతాడు. వారిలో నుండి ఎవరిని వదిలిపెట్టడు. అప్పుడు ఆయన వారు ఇహలోకంలో చేసుకున్న దుష్కర్మల గురించి వారికి తెలియపరుస్తాడు. అల్లాహ్ వారికి వ్యతిరేకంగా వాటిని షుమారు చేసి ఉంచాడు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు వారు వాటిని మరచిపోయారు, ఏ చిన్న దాన్ని గాని పెద్ద దాన్ని గాని వదలకుండా షుమారు చేసిన తమ కర్మల పుస్తకముల్లో వ్రాసి ఉండగా వారు వాటిని పొందుతారు. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువును తెలుసుకునే వాడు వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.