Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 7

أَلَمۡ تَرَ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۖ مَا يَكُونُ مِن نَّجۡوَىٰ ثَلَٰثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمۡ وَلَا خَمۡسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمۡ وَلَآ أَدۡنَىٰ مِن ذَٰلِكَ وَلَآ أَكۡثَرَ إِلَّا هُوَ مَعَهُمۡ أَيۡنَ مَا كَانُواْۖ ثُمَّ يُنَبِّئُهُم بِمَا عَمِلُواْ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ إِنَّ ٱللَّهَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٌ ٧
ఓ ప్రవక్తా ఏమీ ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది అల్లాహ్ కు తెలుసు అని మీరు గమనించలేదా ?! వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. రహస్యంగా ముగ్గురి మాటలు జరిగితే పరిశుద్ధుడైన ఆయన తన జ్ఞానముతో వారిలో నాలుగో వాడవుతాడు. మరియు రహస్యంగా ఐదుగురి మాటలు జరిగితే పరిశుద్ధుడైన ఆయన తన జ్ఞానముతో వారిలో ఆరవ వాడవుతాడు. ఆ లెక్క కన్నా తక్కువ అయినా లేదా దాని కన్నా ఎక్కువ అయిన వారు ఎక్కడ ఉన్నా ఆయన తన జ్ఞానముతో వారితో పాటు ఉంటాడు. వారి మాటల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఆ తరువాత అల్లాహ్ వారికి వారు చేసుకున్న కర్మల గురించి ప్రళయదినమున తెలియపరుస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ కు ప్రతీ వస్తువు గురించి బాగా తెలుసు. ఆయన పై ఏదీ గోప్యంగా ఉండదు.