Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 8

أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ نُهُواْ عَنِ ٱلنَّجۡوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُواْ عَنۡهُ وَيَتَنَٰجَوۡنَ بِٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَمَعۡصِيَتِ ٱلرَّسُولِۖ وَإِذَا جَآءُوكَ حَيَّوۡكَ بِمَا لَمۡ يُحَيِّكَ بِهِ ٱللَّهُ وَيَقُولُونَ فِيٓ أَنفُسِهِمۡ لَوۡلَا يُعَذِّبُنَا ٱللَّهُ بِمَا نَقُولُۚ حَسۡبُهُمۡ جَهَنَّمُ يَصۡلَوۡنَهَاۖ فَبِئۡسَ ٱلۡمَصِيرُ ٨
ఓ ప్రవక్తా మీరు యూదులను చూడలేదా వారు ఏ విశ్వాసపరుడినైనా చూసినప్పుడు రహస్య మంతనాలు చేసేవారు. అల్లాహ్ వారిని రహస్య మంతనాలు చేయటం నుండి వారించాడు. అయినా కూడా వారు అల్లాహ్ వారించిన వాటి వైపునకు మరలుతున్నారు. మరియు వారు విశ్వాసపరుల చాడీలు చెప్పుకోవటం లాంటి పాపములు కల వాటి గురించి మరియు వారికి వ్యతిరేకముగా ద్వేషము కల వాటి గురించి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అవిధేయత కల వాటి గురించి పరస్పరం రహస్య మంతనాలు జరిపేవారు. ఓ ప్రవక్తా వారు మీ వద్దకు వచ్చినప్పుడు వారు అల్లాహ్ మీకు సలాం చేయని వాటి ద్వారా మీకు సలాం చేసేవారు. వారు మరణమును ఉద్దేశించుకుని "అస్సాము అలైక" నీవు నాశనం అయిపో అని పలకటం వారి పలుకులు ఇవి. మరియు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరిస్తూ ఇలా పలికే వారు : ఎందుకని అల్లాహ్ మేము పలికిన మాటలపై శిక్షించడు. ఒక వేళ ఆయన ప్రవక్త అన్న తన వాదనలో సత్య వంతుడే అయితే ఆయన విషయంలో మేము పలికిన వాటి గురించి అల్లాహ్ మమ్మల్ని శిక్షించి ఉండేవాడు. వారు పలికిన మాటలకు శిక్షగా వారికి నరకం చాలును. వారు దాని వేడిని అనుభవిస్తారు. వారి పరిణామము చెడ్డదైన పరిణామము.