Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 9

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا تَنَٰجَيۡتُمۡ فَلَا تَتَنَٰجَوۡاْ بِٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَمَعۡصِيَتِ ٱلرَّسُولِ وَتَنَٰجَوۡاْ بِٱلۡبِرِّ وَٱلتَّقۡوَىٰۖ وَٱتَّقُواْ ٱللَّهَ ٱلَّذِيٓ إِلَيۡهِ تُحۡشَرُونَ ٩
ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్దం చేసిన వాటిని ఆచరించేవారా మీరు పాపము ఉన్న వాటి గురించి లేదా ద్వేషము ఉన్న వాటి గురించి లేదా ప్రవక్తకి అవిధేయత గురించి మీరు యూదులవలే కాకుండా ఉండటానికి రహస్య మంతనాలు చేయకండి. మరియు మీరు అల్లాహ్ కి విధేయత కల మరియు ఆయన అవిధేయత నుండి ఆపే వాటి గురించి రహస్య మంతనాలు చేయండి. మరియు మీరు అల్లాహ్ కి ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండటంతో భయపడండి. ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆయన ఒక్కడి వైపే మీరు సమీకరించబడుతారు.