Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 18

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ ٱللَّهَ وَلۡتَنظُرۡ نَفۡسٞ مَّا قَدَّمَتۡ لِغَدٖۖ وَٱتَّقُواْ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ ١٨
ఓ అల్లాహ్ ను విశ్వసించి తమ కొరకు ఆయన ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయపడండి. మరియు ప్రతి మనిషి ప్రళయదినం కొరకు ముందు చేసుకున్న సత్కర్మను గురించి యోచన చేయాలి. మరియు మీరు అల్లాహ్ కు భయపడండి. నిశ్ఛయంగా అల్లాహ్ మీరు చేసుకున్న కర్మల గురించి తెలుసుకునేవాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు ఆయన వాటిపరంగా మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.